ఆటో లోన్ పై డిఫాల్ట్ ను నివారించండి

Avoid Default On Auto Loan

ఆటో లోన్ నిర్వచించడం?

ఆటో లోన్ అంటే మోటారు వాహనాన్ని కొనడానికి ఒక వ్యక్తి తీసుకునే ఋణం. ఈ ఋణాలు కొనుగోలు
చేసిన వాహనం యొక్క విలువ ఆధారంగా వాయిదాలలోకి రూపొందించబడతాయి.

సురక్షిత ఋణాలను నిర్వచించడం?

ఆటో లోన్ అనేది ఒక రకమైన సురక్షిత ఋణం, ఇక్కడ రుణగ్రహీత ఒక విలువైన వస్తువును
ప్రత్యామ్నాయంగా ఉంచాలి. ఋణగ్రహీత రుణాన్ని తిరిగి చెల్లించలేకపోయినప్పుడు ఈ విలువైన వస్తువు
ఋణదాత అధీనంలో ఉంటుంది. ఆటో రుణాల విషయంలో, ప్రత్యామ్నాయ వస్తువు వాహనమే.

సురక్షిత ఋణాలు ప్రమాదకరమైనవా?

సురక్షిత ఋణాలు, అసురక్షిత ఋణాల కంటే తక్కువ ప్రమాదకరమైనవి, ప్రధానంగా ప్రత్యామ్నాయ
మూలకం కారణంగా. అసురక్షిత ఋణాలతో పోల్చినప్పుడు ఈ ఋణాలు తక్కువ వడ్డీ రేట్లను కలిగి ఉంటాయి. అయితే, ఋణగ్రహీత యొక్క ఋణ యోగ్యతను, ఋణం మంజూరు చేయడానికి ముందు వారి
క్రెడిట్ స్కోరు ద్వారా అంచనా వేస్తారు

ఋణం తిరిగి చెల్లించడంలో డిఫాల్ట్ అయితే దాని పరిణామాలు

  • ఆలస్య చెల్లింపు రుసుము మరియు జరిమానాలు – మీరు మీ EMI చెల్లించడం ఆలస్యం
    అయితే, మీ ఆలస్య రుసుముగా అధిక మొత్తాన్ని వసూలు చేయవచ్చు, కొన్ని సందర్భాల్లో
    జరిమానాల కారణంగా వడ్డీ మొత్తం పెరగవచ్చు.
  • ఋణ వసూళ్ళకు వెళ్ళడం : ఋణదాత సాధారణంగా 30 రోజుల పాటు వేచి ఉంటాడు, ఆ
    సమయంలో వారు మిమ్మల్ని ఫోన్ కాల్స్ లేదా లేఖల ద్వారా సంప్రదించడానికి
    ప్రయత్నిస్తారు. ఎటువంటి సమాధానం లభించకపోతే, అప్పుడు ఋణ వసూళ్ళకు వెళ్ళడం
    జరుగుతుంది. దీనిని ఒక ఏజన్సీ స్వాధీనం చేసుకుని, డబ్బు వసూలు చెయ్యడాన్ని
    నిర్ధారిస్తారు. ఈ ప్రక్రియ మీ క్రెడిట్ స్కోర్ ను తగ్గిస్తుంది అలాగే ఋణదాతలు మీ రుణంపై రిస్క్
    ప్రీమియం వసూలు చేస్తారు.
  • క్రెడిట్ స్కోర్ లో తగ్గుదల – లోన్ డిఫాల్ట్ అనేది మీ క్రెడిట్ స్కోర్ ను తీవ్రంగా ప్రభావితం
    చేస్తుంది. ఇది ఋణం తీసుకునే విషయంలో మీ పై విశ్వసనీయతను తగ్గిస్తుంది. ఋణాలు
    లేదా ఇతర క్రెడిట్లకు మిమ్మల్ని అనర్హులుగా చేస్తుంది.

సురక్షితమైన రుణ తిరిగి చెల్లించడాన్ని డిఫాల్ట్ చేయడం యొక్క పరిణామాలు

  • ప్రత్యామ్నాయం యొక్క పునర్వినియోగం- ఒకవేళ ఋణగ్రహీత సురక్షిత ఋణం పై డిఫాల్ట్ అయితే,
    ఒప్పందం ప్రకారం ఋణదాత ప్రత్యామ్నాయంగా ఉంచిన వస్తువును స్వాధీనం చేసుకునే అర్హత కలిగి
    ఉంటారు., మీ బకాయిలను పరిష్కరించడానికి 7-15 రోజుల నోటీసు వ్యవధిలో కారు లేదా ద్విచక్ర
    వాహనం యొక్క ఋణాన్ని తిరిగి చెల్లించడంలో విఫలమైతే, ఋణదాత మీ వాహనాన్ని స్వాధీనం
    చేసుకోవచ్చు.
  • మీ ప్రత్యామ్నాయం యొక్క వేలం / పునర్విక్రయం – ప్రత్యామ్నాయ వస్తువును తిరిగి స్వాధీనం
    చేసుకున్న తర్వాత బ్యాంకు / ఋణదాతకు ఆస్తికి వ్యతిరేకంగా పునర్విక్రయం చేయడానికి లేదా వేలం
    వేయడానికి హక్కులు ఉన్నాయి. వాహనం యొక్క అమ్మకపు మొత్తం ఋణమొత్తాన్ని మించి ఉంటే
    రుణగ్రహీతకు ముందుగానే తెలియజేయబడుతుంది, మిగిలిన మొత్తం రుణగ్రహీతకు ఇవ్వబడుతుంది.
    ద్విచక్ర వాహనం లేదా కారు విషయంలో, ఋణదాత బకాయిలను పరిష్కరించడానికి 7 రోజుల గ్రేస్
    పీరియడ్ ఇస్తాడు, ఆ తరువాత 90 రోజుల్లో వాహనం అమ్మకానికి ఉంచబడుతుంది.

లోన్ డిఫాల్ట్‌ను నివారించడానికి చిట్కాలు?

  • ఒక బడ్జెట్ తయారు చెయ్యండి – బడ్జెట్‌ను తయారు చేయడం మరియు మీ ఖర్చులను ట్రాక్
    చేయడం ద్వారా మీ నెలవారీ సమాన వాయిదాలను అంటే (EMI) లను విఫలం కాకుండా
    చెల్లించవచ్చు.
  • అత్యవసర నిధిని ఏర్పాటు చెయ్యండి – అత్యవసర పరిస్థితుల కోసం స్థిరంగా డబ్బును
    రిజర్వ్‌ లో జమ చేయండి. ఈ రిజర్వ్ మీ EMI లను చెల్లించడానికి మరియు మీ క్రెడిట్ స్కోర్‌
    పెరగడానికి తోడ్పడుతుంది.
  • మీ ఆస్తిని అంచనా వేయండి – మీరు మీ ఋణాన్ని తిరిగి చెల్లించలేరని భావిస్తే, మీ పరిస్థితిని
    అంచనా వేసుకుని, మీ ఆస్తిని అమ్మడం ఉత్తమం. ఈ కార్యకలాపాలు మీ EMI చెల్లింపులో
    సహాయపడతాయి.
  • మీ ఋణదాతతో చర్చించండి – మీరు మీ ఋణ మొత్తాన్ని చెల్లించలేని పరిస్థితిలో, మీ
    ఋణదాతతో చర్చించడం అనేది ఒక మెరుగైన ఆప్షన్. ఋణదాత మీ వాహనం కంటే మీ
    ఋణం తిరిగి చెల్లింపును కోరుకుంటారు.